ఆగమాశాస్త్రాలు, పురాణాలు ఏయే దేవతా విగ్రహాలు ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పాయి. శాస్త్ర ప్రమాణం ప్రకారం వినాయకుని వగ్రహం ఇలా ఉండాలి.  ‘‘ వినాయకస్తు కర్తవ్యోగజవక్ర్తశ్ఛతుర్భుజ:! శూలకంచాక్షమాలాంచ తస్య దక్షిణహస్తయో!! పాత్రం మోదకపూర్ణంచ పరశుశ్చెవ వామతు:! దంతశ్చాస్యన కర్తవ్యో వామోరిపునిఘాచన!! పాద పీఠకృత: పాదఏక ఆసనగోభవేత్ ! పూర్ణమెదక పాత్రంతు కారగ్రే తస్యకారయేత్!! లంభోదరస్తధాకార్య: స్తబ్థకర్ణశ్చయాదవ ! వ్యాఘ్రచర్మాంబరధర: సర్పయజ్ఞోపవీతవాన్’’!! వినాయకుని విగ్రహం ‘‘ ఏనుగు ముఖం కలిగి నాలుగు చేతులతో ఉండాలి., కుడిచేతిలో శూలము, అక్షమాల, ఎడమ చేతిలో గండ్రగొడ్డలి, మోదకహస్తం (ఉండ్రాళ్లు) నిండిన పాత్రతో ఉండాలి. ఎడమవైపు దంతము ఉండకూడదు. పాద పీఠముపై ఒఖ కాలుపెట్టి ఉండాలి. మోదకపాత్ర తొండము చివర ఉండాలి. ఓ యాదవవంశజా! లంభోదరము, నిక్క బొడిచిన చెవులు, పులిచర్మాన్ని ధరించి ఉండటం, సర్పముని యజ్ఞోపవీతముగా ధరించడము వినాయక విగ్రహ విశేషాలుగా చెప్పబడ్డాయిక్కడ.

మరింత సమాచారం తెలుసుకోండి: